నిలువెత్తు బంగారం ఇచ్చి మొక్కులు చెల్లింపు
– ఎమ్మెల్యే వీరేశం వీరాభిమాని రాపోలు ఉపేందర్
నకిరేకల్ అక్షిత ప్రతినిధి :
నకిరేకల్ ఎమ్మెల్యే గా వేముల వీరేశం గెలిస్తే నిలువెత్తు బంగారం తెస్తానని మొక్కుకున్నారు.
మొక్కినట్టు గా ఎమ్మెల్యే గా గెలువాగనే మొన్న జరిగిన జాతరకు రామన్నపేట పట్టణానికి చెందిన ఎమ్మెల్యే వీరాభిమాని రాపోలు ఉపేందర్ – సరోజ లు మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం నాడు ఎమ్మెల్యే ఇంటికి ఉపేందర్ దంపతులు వెళ్ళి ఎమ్మెల్యే దంపతులకి ప్రసాదం అందజేశారు.