వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో సామాజిక స్పృహ
పిల్లలు కష్టపడకుండా
ఇష్టపడే విధంగా బోధనలు చేయాలి
టెక్నో స్కూల్స్ బోధనలు ప్రశంసనీయం
ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు విద్య వెంకట్
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
విద్యార్థుల్లో నెలకొన్న సామాజిక స్పృహను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు విద్య వెంకట్ అన్నారు. బుధవారం సత్యం టెక్నో స్కూల్ లో సైన్స్ ఫెయిర్ 2024 (వైజ్ఞానిక ప్రదర్శన) ను విద్య వెంకట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లలో పలు వైజ్ఞానిక ప్రదర్శనలు సత్యం టెక్నో స్కూల్ చైర్మన్ గుజ్జు సత్యం తోపాటు తిలకించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల్లో సామాజిక స్పృహను పెంపొందించాలంటే సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నాని అన్నారు. విద్యా రంగంలో పోటీ కారణంగా కేవలం బట్టి చదువులకే పరిమితం కాకుండా సృజనాత్మకతను పెంపొందించే విధంగా పాఠాలు బోధిస్తే వారు భావి భారత పౌరులుగా తీర్చిదిద్ద గల శక్తి అధ్యాపక వర్గానికి ఉంటుందన్నారు. చిరుప్రాయంలోనే పిల్లలు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివే బోధనా రంగ వ్యవస్థ ఏర్పడాలన్నారు. తద్వారా పిల్లల చదువు సంస్కారం, సభ్యతతో ముందుకు సాగితే భావితరాలకు ఆదర్శ పౌరులు కాగలరని అన్నారు. సత్యం టెక్నో స్కూల్ చైర్మన్ గుజ్జు సత్యం మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు ఆదర్శనీయమైన బోధనతో పాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రమశిక్షణ గల నైపుణ్యత అధ్యాపక వర్గంతో బోధనలు చేస్తున్నట్లు తెలిపారు. తమ పాఠశాలల్లో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించడానికి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యక్షంగా పనితీరును అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు ప్రతి యేదాడి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అరవింద టెక్నో స్కూల్స్ డైరెక్టర్ అరవింద్ బాబు, ప్రిన్సిపాల్ వెంకటేశం,కరస్పాండెంట్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.