ఆస్తిపన్ను వడ్డీపై
90శాతం రాయితీ
రాయితీని సద్వినియోగం చేసుకొని పన్ను చెల్లించండి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఆస్తిపన్ను వడ్డీపై 90శాతం రాయితిని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ మునిసిపల్ కమీషనర్ ఎండి. యూసుఫ్ కోరారు. గురువారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీలలో ఆస్తిపన్ను చెల్లించేందుకు 90శాతం వడ్డీ రాయితీ ఇస్తూ ఈ నెల 27న జిఓ ఆర్టీ నెంబర్ 101ను మునిసిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానాకిశోర్ జారీ చేశారని ఆయన తెలిపారు. మిర్యాలగూడలో 2022-23 ఆర్ధిక సంవత్సరం వరకు సుమారు 16 కోట్ల రూపాయలు బకాయిలున్నారని అందులో 8.20 కోట్ల రూపాయలు వడ్డీ అని అయితే జారీ అయిన జిఓ వల్ల మునిసిపాలిటీకి రూ82లక్షలు మాత్రమే వస్తాయని, మిగిత రూ.7.4కోట్ల రూపాయల మేర పన్నుదారులకు లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు. ఆస్తి పన్ను వసూలు ప్రత్యేక కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆరుగురు బిల్ కలెక్టర్లు ఆరు బిల్లింగ్ మిషన్లతో వసూలు చేస్తున్నారని, మరో బిల్లింగ్ మిషన్లు వస్తున్నాయని వార్డు ఆఫీసర్లతో వసూలు కార్యక్రమం వేగవంతం చేస్తామని ఆయన అన్నారు.
ఆయన వెంట రెవిన్యూ ఆఫీసర్ డి. కళ్యాణి, అకౌంటెంట్ ఎం. కళ్యాణి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాకేష్ లున్నారు.