అభివృద్ధిలో అగ్రగామిగా చేస్తా

అభివృద్ధిలో అగ్రగామిగా చేస్తా
హస్తినాపురం కార్పొరేటర్
సుజాత నాయక్

హస్తినాపురం, అక్షిత ప్రతినిధి :
హస్తినాపురం డివిజన్ పరిధిలోని కాలనీలో నెలకొన్న సమస్యలనుపరిష్కరించనున్నట్లు కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ తెలిపారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీ ఫేస్ 2 కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాయితి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించి కృషి చేయనున్నట్లు తెలిపారు. కాలనీలో పది లక్షలచే బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టినందుకు కార్పొరేటర్ కు కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో ఎక్కడ సమస్య ఉన్న తన దృష్టికి తెచ్చిన వెంటనే సంబంధిత అధికారులను వివరించి సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు.హస్తినాపురం డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు తయారుచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking