మేడిగడ్డ బృందంకు పెంబర్తి వద్ద ఘనస్వాగతం
జనగామ, అక్షిత ప్రతినిధి:
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను వివరించేందుకే బీఆర్‌ఎస్ సిద్ధమైంది. శుక్రవారం హైదరా బాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయల్దేరారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖద్వారం అయినా పెంబర్తి వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి మేడిగడ్డను సందర్శించే బృందంకు ఘనస్వాగతం పలికారు..జై తెలంగాణ..జై కెసిఆర్..జై కేటీఆర్..జై పల్లా అనే నినాదా లతో హోరేత్తించారు.

ఎమ్మెల్యే పల్లా :
చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు వాస్తవాలను తెలియచేసేందుకు ఇవాళ తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం మేడిగడ్డకు తరలివెళ్లడం జరుగుతుంది.మేడిగడ్డ పరిశీలన తర్వాత అన్నారం బరాజీని పరిశీలించింనతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది.మేడిగడ్డ బరాజ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలను వివరిస్తాం… ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ సర్పంచులు, మండల నాయకులు, ముఖ్య కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.