వైభవంగా మంత్రి కూతురు వివాహా రిసెప్షన్ వేడుక..

వైభవంగా మంత్రి కూతురు వివాహా రిసెప్షన్ వేడుక..
–హజరైన మంత్రి పొంగులేటి… మాజీ మంత్రి ఈటెల, ఇతర ప్రముఖులు…
–60 వేలకు పైగా హజరైన నాయకులు, కార్యకర్తలు…
–భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు
అందోలు, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కూతురు వివాహ వివాహా విందు వేడుక ఆదివారం అందోలు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్ పూర్ సింగూరు చౌరస్తా వద్ద ఘనంగా జరిగింది. ఈ వేడుక ఉదయం 11 గంటల తర్వాత ప్రారంభం కాగా, సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. 40 ఎకరాల వీస్తీర్ణంలో రిసెప్షన్‌ వేదికను ఏర్పాటు చేయగా, వాహనాల పార్కింగ్‌ కు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.

 

*-వధువరులను ఆశీర్వధించిన ప్రముఖులు..*

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఏకైక కూతురు త్రిష– అల్లుడు మణికంఠలను ఆశీర్వదించేందుకు రాష్ట్ర నాయకులతో పాటు నియోజకవర్గానికి చెందిన రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. వీఐపీలకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా నేరుగా రిసెప్షన్‌ వేదిక వద్దకు వేళ్లేందుకు ప్రత్యేక దారీని ఏర్పాటు చేశారు. అదే విధంగా వారి కోసం ప్రత్యేకంగా భోజనం చేసేందుకు షెడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వివాహ వేడుకకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే ఎనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌, అవినాష్ గౌడ్, కాటా శ్రీనివాస్ గౌడ్ తో పాటు వివిధ పార్టీ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. వేలది సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు హజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర, జిల్లా నలుమూలల నుంచే కాకుండా అందోలు నియోజకవర్గంలో మండలాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. రిసెప్షన్‌లో ఏలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రిసెప్షన్‌ వచ్చిన వారికి భోజనాలు చేసేందుకు ఎక్కడికక్కడ భోజన గ్యాలరీలను ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking