నిండు జీవితానికి… రెండు చుక్కలు చాలు

మండల వ్యాప్తంగా పల్స్ పోలియో

చేర్యాల,మార్చి 3 అక్షిత ప్రతినిధి: సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ పట్టణ కేంద్రంలో చైర్ పర్సన్ అంకువారి స్వరూప రాణి పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించగా, ఆయా వార్డులలో కౌన్సిలర్లు ప్రారంభించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఎంపీటీసీలు, వైద్య అధికారులు పల్స్ పోలియో కేంద్రాలను ప్రారంభించగా, పోతిరెడ్డి పల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమంలో చేర్యాల మండల ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు గూడూరు బాల్ రాజు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలను వేసినారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ప్రియాంక,ఆశా వర్కర్లు రమ్య, పుష్ప, మరియు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking