ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న ఎస్ ఐ దామోదర్
చేర్యాల,మార్చి 03 అక్షిత ప్రతినిధి: చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని దానంపల్లి గ్రామ శివారులో ఎలాంటి ప్రభుత్వం అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను ఆదివారం పట్టుకున్న చేర్యాల ఎస్ఐ దామోదర్. ఈ సందర్భంగా ఎస్ఐ దామోదర్ మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసిన వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్స్ సతీష్, వెంకట్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.