‘పల్లె దావాఖాన’ నిర్మాణ పనుల్లో ఇసుక కు బదులు డస్ట్

‘పల్లె దావాఖాన’ నిర్మాణ పనుల్లో ఇసుక కు బదులు డస్ట్

నాణ్యత ప్రమాణాలు పాటించకుండా భవన నిర్మాణం పనులు

మండల సిపిఎం పార్టీ నాయకులు

అక్షిత న్యూస్, మాడుగులపల్లి:

మాడుగులపల్లి మండలం పరిధిలోని ఆగమోత్కూర్ గ్రామంలో నిర్మిస్తున్న పల్లె దావాఖాన నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మిస్తున్నారని మండల సిపిఎం పార్టీ నాయకులు అన్నారు.ఆదివారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పరిధిలోని ఆగమోత్కూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పల్లె దావకానను మండలం సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న పల్లె దావకాన నిర్మాణ పనుల్లో వాడుతున్న ఇసుకకు బదులు డస్ట్ వాడుతున్నారని అలాగే వాటర్ క్యూరింగ్ లేకుండా నాసిరకంగా నిర్మాణ పనులు చేస్తున్నారని అన్నారు. నిర్మాణంలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా నాసిరకం సిమెంటు, డస్టులతో భవనాన్ని నిర్మిస్తున్నారని పల్లె దావకాన నిర్మాణంలో నాణ్యత పరమైన ప్రమాణాలను పాటించి నాణ్యతగా నిర్మించాలని కోరారు. అనంతరం పంచాయతీరాజ్ ఏఈ కి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు పతాని శీను, గ్రామ కార్యదర్శి బంటు రాజు, పవన్, సైదులు, అంజయ్య తదిపరులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking