ఖమ్మంలో ఘనంగా ఎస్సీ బాలుర హాస్టల్ (బి) వార్షికోత్సవం
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంలోని ఎస్సీ బాలుర వసతి గృహం (బి) హాస్టల్ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.ఈ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ కస్తాల సత్యనారాయణ హాజరైనారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల ఆటపాటల మధ్య హాస్టల్ వార్షికోత్సవం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. (బి) హాస్టల్లో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రతి హాస్టల్లో కూడా హాస్టల్ డే జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మూలంగా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం వస్తుంది.

ఈ సంవత్సరం 10 వ తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం కొరకు వసతి గృహ సంక్షేమ అధికారులు ఉపాధ్యాయులు కష్టపడుతున్నారని అదే విధంగా వసతిగృహాలలో విద్యార్థులకు అన్ని వసతులు సమకూరుస్తున్నామని మెనూ సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది.అనంతరం (బి) హాస్టల్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఖమ్మం ఎ ఎస్ డబ్ల్యూ ఓ ఏ శ్రీలత ఎస్ సి బాలుర హాస్టల్ (బి) వసతి గృహ సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు వసతిగృహ సంక్షేమ అధికారులు యన్.నాగేశ్వరరావు కె.తిరుపతి రావు ఎన్ విజయ ఎం విజయలక్ష్మి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు నాలుగో తరగతి సిబ్బంది పాల్గొన్నారు.