పోలియో రహిత రాష్ట్రం అందరి లక్ష్యం కావాలి..*

*పోలియో రహిత రాష్ట్రం అందరి లక్ష్యం కావాలి..*
– రాష్ట్ర వ్యాప్తంగా 40.5 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యం
– ఇంటింటికీ వెళ్లి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలి
– పల్స్‌పోలియో చుక్కలు వేయించే బాధ్యత తల్లిదండ్రులదే..
– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ
– జోగిపేటలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి
అందోలు, అక్షిత ప్రతినిధి :
పోలియో రహిత రాష్ట్రాన్ని నిర్మించడం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ఆదివారం జోగిపేటలోని ప్రభుత్వాసుపత్రిలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్‌ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0-5 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్క చిన్నారికి తప్పకుండా పోలీయో చుక్కలను వేయించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40.5లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి తెలిపారు. పోలియో చుక్కలు వేయించడంలో చిన్నారుల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయోద్దన్నారు. ఆశ, అంగన్‌వాడీ, ఎఎన్‌ఎంలు ఇంటింటికి వేళ్లి చిన్నారులకు పోలియో చుక్కలను వేస్తారన్నారు.

ఆరు గ్యారంటీల్లో నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేసామని మంత్రి అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, గ్యాస్‌ సబ్సిడీ, ఆరోగ్యశ్రీ పదిలక్షలకు పెంపు, గృహజ్యోతి, పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంబించబోతున్నామని అన్నారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విధంగానే అన్ని హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అని మరోసారి గుర్తు చేశారు.ఈ సందర్భంగా జోగిపేట పట్టణంలోని గృహ జ్యోతి లబ్దిదారులకు ఉచిత విద్యుత్‌ పంపిణీకి సంబంధించి జీరో బిల్లును అందజేశారు. లబ్దిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
– లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో…
జోగిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లైన్స్‌క్లబ్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్‌పోలియో కార్యక్రమంలో మంత్రి దామోదర్‌ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్బంగా జిల్లా లయన్స్‌ క్లబ్‌ చైర్‌ పర్సన్‌ (పల్స్‌ పోలియో) ఎ.రాంబాబు, క్లబ్‌ సభ్యులను మంత్రి అభినందించారు. లైయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో చేపడుతున్న సేవ కార్యక్రమాలు అభినందనీయమని ,భవిష్యత్‌లో మరింతగా సేవలు విస్తృతం చేయాలన్నారు.
*అంబులెన్స్‌ ను ప్రారంభించిన మంత్రి*:
ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీ వారు జోగిపేట ప్రభుత్వాసుప్రతికి అందజేసిన అంబులేన్సు వాహనాన్ని మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో అంబులేన్స్‌ సేవలను వినియోగించుకొవాలని, రోగులకు అంబులేన్స్‌ను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. అంబులేన్స్‌ను అందజేసిన ఎంఆర్‌ఎఫ్‌ యజమాన్యాన్ని మంత్రి అభినందించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ఆర్‌ చంద్రశేఖర్, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ గాయత్రీదేవి, చైల్డ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సంగారెడ్డి, ఆర్‌బీఎస్‌కే డాక్టర్‌ శ్రీనాథ్, చైల్డ్,హెల్త్‌ రాష్ట్ర అధికారి భానుకిరణ్, డబ్ల్యూహెచ్‌ఓ సందీప్‌పాటిల్, డీఐఓ శశాంక్‌ దేశ్‌పాండే, యునిసెఫ్‌ కన్సల్టెంట్‌ రవినాయుడు, ప్రోగ్రాం అసిస్టెంట్‌ శ్రీధర్, ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ రమేశ్, ఆర్‌డీవో పాండు, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, కౌన్సిలర్లు చిట్టిబాబు,సురేందర్‌గౌడ్, డాకూరి శంకర్, రంగ సురేష్, హరికష్ణగౌడ్, రేఖా ప్రవీణ్‌గౌడ్, దుర్గేష్, కే.నాగరాజు, చందర్‌ నాయక్, మాజీ ఏఎంసీ చైర్మన్‌ పద్మనాభరెడ్డి, సొసైటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, వెస్‌ చైర్మన్‌ హన్మాండ్లు, మాజీ ఎంపీటీసీ డీజీ వెంకటేశం తో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking