*మాటిస్తే మడమ తిప్పని మంత్రి దామోదర..*
– వట్‌పల్లికి 30 పడకల ప్రభుత్వాసుపత్రి మంజూరు…
– వాగ్దానానికి రెండు నెలల్లోనే కార్యరూపం ఇచ్చిన మంత్రి
–రూ.11.20 కోట్ల నిధులతో వెలువడిన ఉత్తర్వులు..
– ఈనెల 9న ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్న మంత్రి
– హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు…
అందోలు, అక్షిత ప్రతినిధి :
అభివద్ధి అంటే అతడే..తరాలు మారిన చెరగని అభివద్ధి ముద్ర.. ఓ విజన్ ఉన్న నాయకుడు.. సైనికుడు.. అతడు అంటే ఓ నమ్మకం.. విశ్వాసం ఉన్న నాయకుడు దామోదర రాజనర్సింహా అని అనడంలో అందోలు నియోజకవర్గ ప్రజల్లో సందేహం లేదు..తాను ఏ శాఖ మంత్రి పదవి చేపట్టిన నియోజకవర్గంలో ఆ శాఖ సంబందించి గుర్తుండిపోయేలా అభివద్ధి పని చేపట్టడం అతని నైజం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దామోదర రాజనర్సింహా వట్‌పల్లికి ప్రభుత్వాసుపత్రి తీసుకువస్తానని ఇచ్చిన మాటను రెండు నెలల్లోనే నెరవేర్చి మాట నిలుపుకున్నాడు. వట్‌పల్లి కేంద్రంలో 30 పడకల ప్రభుత్వాసుపత్రిని మంజూరు చేయించడం ద్వారా సోమవారం ప్రభుత్వాసుపత్రి మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఆసుపత్రి నిర్మాణానికి సంబందించి రూ.11.20 కోట్ల నిధులను కేటాయించింది.

*–కల సకారమవుతున్న వేళ…*
వట్‌పల్లి నూతన మండలం ఏర్పటు సమయంలో మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అసుపత్రి వంటి ఇతరత్రా సదుపాయాలను కల్పించకుండానే గత ప్రభుత్వం నూతన మండాలాన్ని ఏర్పాటుచేసి వదిలేసింది. దీంతో కనీస సౌకర్యాలు లేక మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ ఉచిత వైద్యం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వచ్చేది. అత్యవసర సమయాల్లో జోగిపేట, సంగారెడ్డి సుదూర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది. ఈ విషయంపై అనేక సార్లు స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలియజేసినా ఫలితం లేకుండా పోయింది. ఏడేళ్లుగా వైద్య ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో ఎట్టకేలకు దామోదర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వట్పల్లిలో 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడంపై మండల ప్రజలకు ప్రభుత్వ వైద్యం కళ సకారమవబోతోంది.

*-హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు…*
వట్ పల్లి మండల వాసులకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారడంతో పాటు అత్యవసర సమయాల్లో కనీసం అంబులెన్స్ వాహనం కూడా అందుబాటులో లేకపోవడం వంటి సమయాల్లో వట్ పల్లిలో 30 పడకల ఆసుపత్రి మంజూరు కావడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వట్పల్లిలో ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
*-నియోజకవర్గంపై తనదైన ముద్ర…*
దామోదర రాజనిర్సంహా ఎమ్మెల్యేగా గెలుపొందిన అన్ని సందర్భాల్లో పార్టీ అధికారంలోకి రావడం దామోదరకు మంత్రి పదవి వరించడం జరిగింది. దీంతో దామోదర్ ఏ శాఖ పదవి చేపట్టిన ఆ శాఖకు సంబందించి చిర స్థాయిలో నిలిచేలా అభివృద్ధి పనులు చేపడుతూ వస్తున్నాడు. విద్యాశాఖ మంత్రిగా సుల్తాన్పూర్ జెఎన్టీయూ, జోగిపేటలో మహిళ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు, కేజిబీవిలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ పాఠశాలల వంటివి ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ శాఖ మంత్రిగా వట్పల్లి. రాయికోడ్లలో మార్కెట్యార్డుల నిర్మాణ వంటి అనేక అభివృద్ధి పనులుచేపట్టి అభివృద్ధి ప్రదాతగా పేరు గడించాడు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అందోలు మున్సిపాలిటీ పరిధిలోని నర్సింగ్ కళాశాల, 150 పడకల మల్టీసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. జోగిపేటను వ్యాపారంలో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అజమర్రి, జోగిపేటకు మంజీర నదిపై వంతెనను నిర్మించి రోడ్డు సౌకర్యం కల్పించే పనులకు మంత్రి త్వరలో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నాడు.