*సంధ్యను పరామర్శించిన* *కెఎస్ఆర్*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఇటీవల మృతి చెందిన నవ్య ప్రింటర్స్ అధినేత ఆర్.రామక్రిష్ణా రెడ్డి సహచరి, పివోడబ్ల్యూ అధ్యక్షురాలు వి.సంధ్యను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి బుధవారం సాయంత్రం హిమాయత్ నగర్ లోని ఆమె నివాసంలో పరామర్శించారు.

ప్రజాస్వామికవాది, సౌమ్యుడు ఆర్.కె.ఆర్ మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేస్తూ, సంధ్యను ఓదార్చారు. శ్రీనివాస్ రెడ్డితో పాటు టీయుడబ్ల్యూజే నేత
కె.విరాహత్ అలీ, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగ శంకర్ గౌడ్ లు సంధ్యను పరామర్శించారు.