కేసిఆర్ దోపిడీపై విచారణ జరపాలి..
రఘువీర్ రెడ్డి..ఎన్ ఆర్ ఐ, జేఏసీ
సోమాజిగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణలో కేసిఆర్ పాలనకు చరమగీతం పాడిన ప్రజలకు ఎన్ ఆర్ ఐ జేఏసీ నాయకులు రఘువీర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
3 వసారీ మోదీ అధికారంలోకి రావాలని కోరారు. ప్రతిపక్షం ఉండాలి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల తో సరిపెట్టుకోవాలని అన్నారు. కేటిఆర్ అధికారం కోల్పోయాకా ఏం మాట్లడుతున్నాడో ఆయనకే అర్ధం కావడం లేదని, కల్వకుంట్ల కుటుంబాన్ని శాశ్వతంగా రాజకీయంగా దూరం చెయ్యాలని కోరారు. కవిత కొత్త డ్రామా మొదలు పెట్టిందని, పూలే విగ్రహం పెట్టాలని డిమాండ్ చెయ్యడం సిగ్గుచేటన్నారు.అధికారంలో వుండగా గుర్తుకు రాలేదాని ప్రశ్నించారు. ఎన్ ఆర్ ఐ ల భూములు కూడా కబ్జాలు చేశారని, ప్రజాప్రతినిధులు ఎన్ ఆర్ ఐ లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేసిఆర్ కుటుంబ దోపిడీ పై విచారణ జరపాలని, కేటిఆర్, కవిత అక్రమ ఆస్తులపై విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో దేశాన్ని అగ్రబాగాన నిలవాలంటే, మోదీని మూడవసారి ప్రధానిని చెయ్యాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచంలో భారత్ ను విశ్వగురు చేయాలంటే అది మోదీ వల్లనే సాధ్యమన్నారు. చైనా వంటి దురాక్రమణ దేశాన్ని ఎదుర్కోవాలంటే మోదీ వంటి సమర్ధుడైన నాయకుడి వల్లే సాధ్యమన్నారు. రాహుల్ గాంధీ లాంటి వారు అధికారం లోకి వస్తే తీవ్రవాదం పెరిగి పోతుందని, ప్రజలు దేశ రక్షణ కోసం బిజెపికి అండదండలు అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వంటి బలహీనమైన నాయకత్వం వల్ల దేశానికి భద్రత లేదని, భవిష్యత్తు కూడా ఉండబోదని విజ్ఞప్తి చేశారు. కుటుంబ వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికి, దేశ భక్తులకు అధికారాన్ని కట్టబెట్టాలని రఘువీర్ రెడ్డి కోరారు.