యువతకు మార్గదర్శి ‘భరత్ చంద్ర’

యువతకు మార్గదర్శి ‘భరత్ చంద్ర’
* పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా
12 ముస్లిం కుటుంబాలకు కిట్ల పంపిణీ అభినందనీయం

హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

#తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది మదాస్ భరత్ చంద్ర సేవలు యువతకు మార్గదర్శిగా నిలుస్తున్నాయని నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ అభివర్ణించారు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు మంగళవారం ( మార్చి 12) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 12 ముస్లిం కుటుంబాలకు సేమియా కిట్లు పంపిణీ చేసేందుకు ఆయన ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మదాస్ భరత్ చంద్ర ఆర్థిక సహకారంతో అందజేసిన కిట్లను హమీద్ షేక్ పంపిణీ చేశారు.

రంజాన్ ఉపవాస దీక్షలను ముస్లిం సోదరసోదరీమణులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఆకాంక్షించారు. సేవా నిరతితో, సహృద్భావంతో పలు ముస్లిం కుటుంబాలకు తన వంతుగా సాయం అందించేందుకు ముందుకు వచ్చిన మదాస్ భరత్ చంద్ర ఆలోచనా సరళి ప్రశస్తమైందని అన్నారు. మదాస్ భరత్ చంద్ర సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచారని హమీద్ షేక్ ప్రశంసించారు.

యువత సమాజసేవలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్ధార్, జానీపాషా, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking