ఆగ్రోస్ దోపిడి

ఆగ్రోస్ దోపిడి

ఇష్టారాజ్యంగా ధరలు

యూరియా పక్కదారి

కన్నెత్తి చూడని వ్యవసాయ శాఖ

 

మాడుగులపల్లి,అక్షిత న్యూస్ :

దళారుల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు నెలకొల్పిన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం లక్ష్యం నీరు గారుతుంది. రైతులకు అండగా ఉండేందుకు బదులుగా దోపిడీకి బార్లాగా గేట్లు తెరిచింది. విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులను కొనుగోలు చేసే ప్రక్రియలో రైతులు దళారుల నుంచి రక్షణ కల్పించేందుకు పట్నాలకు తోడు పల్లెల్లోనూ ఆగ్రోస్ సేవా కేంద్రాలను తెరచింది. ఆయా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని క్రిమి సంహారక మందులను నిర్దేశించిన ధరలకు విక్రయించాల్సి ఉంది. రైతులకు ఆపన్న హస్తం అందించే బదులుగా రైతులను నిండా ముంచుతుంది. కొరతలను సృష్టించి అత్యధిక ధరలకు విక్రయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది… మాడుగులపల్లి మండలం పాములపాడు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం తీరిది. రైతులకు భరోసా అటుంచితే రైతులను దోపిడి చేస్తుంది. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పటికి పట్టించుకోవాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండ్రు. రైతులకు కల్గే అసౌకర్యం విషయమై వచ్చే ఫిర్యాదులపై కనీసం పట్టించుకోవడం లేదు.మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో యూరియా అధిక ధరలకు విక్రయిస్తూ ప్రభుత్వం నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ వారి ఇష్టానుసారంగా స్థానిక రైతులకు అందవలసిన యూరియాని పాములపాడులో ఉన్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో మందులు కొన్నవారికి, ఖాతాదారులకు మాత్రమే యూరియా ఇవ్వడం జరుగుతుందని పలుమార్లు రైతులు అధికారులకు తెలియజేసిన కూడా నిమ్మకు నీరు ఎత్తనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారని రైతుల ఆవేదన.

 

ఆ రైతులు ఆగ్రో రైతు సేవ కేంద్రం దగ్గర పలుమార్లు ప్రశ్నించడం జరిగింది.అయినా కూడా ఫలితం లేకపోవడంతో ఒక్కో బస్తాకు 40 నుంచి 50 రూపాయల పైచిలుకు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న కూడా పట్టించుకోని అధికార యంత్రాంగం ఉంది. రైతుకు అవసరమైన యూరియా కాబట్టి తీసుకోవడం జరుగుతుందని రైతులు అంటున్నారు కనీసం ఆగ్రోస్ కేంద్రంలో బిల్లులు ఇవ్వమన్నా కూడా రైతులకు మీకు బిల్లు కావాలా? లేక యూరియా కావాలా ?అని బెదిరింపులు కొనసాగుతున్నాయన్నారు. రైతుల గోడు తీర్చే వారు ఎవరు అని రైతుల సొమ్మును కాపాడే వారెవరు తక్షణమే వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ రైతుల ఆవేదన. గోదాంలో స్టాక్ ఉన్నా కూడా మా దగ్గర యూరియా లేదు అని చెప్పడం జరుగుతుందని, కనీసం మా దగ్గర మీరు మందులు కొంటేనే యూరియా ఇస్తామని డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుందని, రైతులు గగ్గోలు పెట్టి వ్యవసాయ అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం ఏంటో తేలవలసి ఉంది. ఈ విషయం పై ‘అక్షిత ప్రతినిధి” దృష్టికి రైతులు చేయడంతో పాములపాడు ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం దగ్గరికి వెళ్లి అక్షిత ప్రతినిధి యూరియా కావాలని అడగగా మా దగ్గర యూరియా లేదని సమాధానం చెప్పారు. వ్యవసాయ అధికారిని వివరణ కోరగా మాకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని సమాధానం చెప్పడం కొసమెరుపు.ఆ షాప్ లో ప్రస్తుతానికి 35 బస్తాలు ఏరియా ఉంది అని వారు వివరణ ఇవ్వడం జరిగింది. అక్రమాలపై అధికారులు దృష్టి సారించి విచారిస్తారా ? లేదో వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.

Breaking