పోషణ పక్షం-2024 పక్కడ్బందీగా అమలు

పోషణ పక్షం-2024 పక్కడ్బందీగా అమలు

*సీడీపీఓ మమత
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో పోషణ పక్షం -2024 కార్యక్రమాలను మార్చి 9 నుండి 23 వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో విధిగా నిర్వహించాలని సీడీపీఓ ఆర్.మమత సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. పోషణ పక్షం -2024లో నిర్వహించవలసిన వివిధ రకాల కార్యక్రమాలను 3 ప్రతిపాదిత థీమ్ లుగా నిర్వహించాలన్నారు.
పోషన్ భీ,పడాయి భీ (పిబిపిబి) గిరిజన, సాంప్రదాయ, ప్రాంతీయ స్థానిక ఆహార పద్ధతులు, పోషకాహారంపై అవగాహన కల్పించడం, గర్భిణీల ఆరోగ్యం, శిశు, చిన్న పిల్లల ఆహార ఐవైసిఎఫ్ ఆచరణలు.థీమ్లను అనుసరించి వివిధ రకాల కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, భాగస్వామ్య ప్రభుత్వ శాఖలతో వివిధ కార్యక్రమాల నిర్వహణను సమన్వయం చేసుకోవాలని, పోషకాహార సూచికలను మెరుగుపరచడం కోసం ప్రాజెక్ట్ పరిధిలో పోషకాహార కేంద్రీకృత అవగాహనను తీసుకువచ్చి జనచైతన్యం కలిగించాలని ఎప్పటిలాగే పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking