సమాజాభివృద్ధిలో స్త్రీ పాత్ర వెలకట్టలేము
-ఎఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ విజయ కుమారి
ఖమ్మం/అక్షిత బ్యూరో :
పిఆర్టీయూ టిఎస్ ఖమ్మం జిల్లా శాఖ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తారీఖులలో ఆటల పోటీలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించారు.రెండు రోజులు నిర్వహించిన ఆటలలో గెలుపొందిన మహిళా ఉపాధ్యాయులకు ఈరోజు బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం పీఆర్టీయూ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేయడమైనది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి విజయకుమారి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే సమాజం సన్మార్గంలో నడుస్తుందని ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మహిళలు విద్యార్థులని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వారికి సూచనలు సలహాలు అందిస్తూ సన్మార్గంలో నడవడానికి కారకులు కావాలని కోరారు. సమావేశానికి విశిష్ట అతిథిగా హాజరైన డాక్టర్ కావ్యాచంద్ యాలమూడి మాట్లాడుతూ మహిళలు ఈ మధ్యకాలంలో తరచుగా వ్యాధులకు గురవుతున్నటువంటి షుగర్ బిపి థైరాయిడ్ వ్యాధులపై మహిళా ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అనంతరం ఆటలలో గెలుపొందిన మహిళా ఉపాధ్యాయులకు బహుమతులు అందజేయనైనది.ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పీఆర్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు హారిత మాట్లాడుతూ మూడు రోజులు పాటు మహిళా దినోత్సవ సంభరాలు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించటం గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని అనుభూతిని కలిగించిందని తెలిపారు.25 మార్చిలోపు పదవి విరమణ పొందే మహిళా ఉపాధ్యాయులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడమైనది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జయమ్మ హరిత సుమతి సునీత భారతి ఝాన్సీ రెహనా అన్నపూర్ణ రాజకుమారి సునీల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధు రంగారావు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎలమంచి వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ రావు సుదర్శన్ రమణారావు సైదుబాబు హుస్సేన్ సోమ్లా నాయక్ కందల వెంకట నరసయ్య పెద్ద సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.