ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ప్రజాస్వామ్య పరిరక్షణకు పౌర సంఘాలు ఐక్యంగా ఉండి పోరాడాలని డాక్టర్ గోపీనాథ్ అన్నారు.శనివారం ఖమ్మం వైరా రోడ్ లోని సితార హోటల్ లోని ముహమ్మద్ ఇలియాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతు భారతదేశం పేరుకు మాత్రమే ప్రజాస్వామ్య దేశంగా ఉందని నేటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్న బీజేపీని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలన్నారు.అనంతరం వివిధ పౌరసంఘాల బాధ్యులు ప్రసంగించారు.

సమావేశం ఆనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ గోపీనాథ్ ఉపాధ్యక్షులుగా డాక్టర్ బివి రాఘవలు లాయర్ తిరుమలరావు లెక్చరర్ అర్ జీవన్ కుమార్ కొప్పుల నాగమణీ ప్రధాన కార్యదర్శిగా సాధిక్ అహ్మద్ సెక్రటరీగా డాక్టర్ కేవి కృష్ణారావు జాయింట్ సెక్రటరీగా వెంకటేశ్వరరావు కోశాధికారిగా అబ్దుల్ ముజీబ్ ను ఎన్నుకున్నారు.ఈ సమావేశం లో విజయ్ రమేష్ కారల్ మార్క్స్ రాంబాబు మౌలానా అబ్దుల్ ఘని జైనుల్ పాషా అనిల్ కుమార్ బిషఫ్ లాజర్ అడ్వకేట్ సాదిక్ బద్రు నాయక్ అబ్దుల్ సమి లక్ష్మీ నారాయణ అబ్దుల్ మలిక్ అబ్రార్ అబ్దుల్ రహేమన్ గణేష్ నాగమణి సుశీల హుస్సేన్ బీ చరిత్ర అధ్యాపకులు రఫీ తదితరులు పాల్గొన్నారు.