అంబేద్కర్, పూలే* *ఆశయాలను నెరవేర్చండి*

*అంబేద్కర్, పూలే* *ఆశయాలను నెరవేర్చండి*

*-తొలి విడత చైతన్య* *రథయాత్రను ప్రారంభించిన* *తెలంగాణ రాష్ట్ర వర్కింగ్* *జర్నలిస్టుల సంఘం నేత విరాహత్ అలీ*

గజ్వేల్, అక్షిత ప్రతినిధి :

సమాజంలో మనుషులు, మనుషులుగా గుర్తించబడడం కోసం తమ విలువైన జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావులు బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావ్ పూలెల ఆశయ సాధనకై ప్రతి పౌరుడు కంకణం కట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ పిలుపునిచ్చారు. బుధవారం నాడు సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నియోజకవర్గంలోని కుకునూర్ పల్లి మండలం, మంగోల్ గ్రామంలో ఫూలే -అంబేడ్కర్ వారసుల చైతన్య రథయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఒకప్పుడు విప్లవోద్యమాలకు పురిటి గడ్డ అయిన మంగోల్ గ్రామం నుండి రథయాత్రను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణ నిరుపేదలను ఏకం చేస్తూ, వారి హక్కుల పరిరక్షణ కోసం రథయాత్రను కొనసాగించడం ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయుల కళ్ళు తెరిపించడానికి ఎంతో దోహదపడుతుందని విరాహత్ స్పష్టం చేశారు.


కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బహుజన వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి అంబేడ్కర్, పూలె వారసులుగా నిర్వహిస్తున్న ఈ రథయాత్ర, రాజ్యాంగ పరిరక్షణకు దోహద పడుతుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పుకునే భారతదేశంలో, అత్యధిక జనాభ కలిగివున్న ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ, పిడికెడు జనాభా కలిగి ఉన్న బడాబాబుల ప్రయోజనాల కోసం పాలకులు విధానాలను అనుసరించడం విచారకరమన్నారు.

బహుజన ఉద్యమకారుడు తుమ్మ శ్రీనివాస్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గజ్వేల్ జర్నలిస్ట్స్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎన్నెల్కి అధ్యక్షులు ఎన్నెల్లి సురేందర్, మంగోల్ తాజా,మాజీ సర్పంచ్ పుల్లోజు కిరణ్ చారీ, మాల జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ మన్నే కృపానందం, మరియు వివిధ బీసీ సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking