మాదిగల ఆర్థిక పరిపుష్టికి కృషి

మాదిగల ఆర్థిక పరిపుష్టికి కృషి
మిక్కి క్యాలెండర్ ఆవిష్కరణ
మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : మాదిగలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం తన నివాసంలో మాదిగ ఇంటిగ్రేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కి)క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాదిగలు అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు.పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వం అందించే సహకారంతో పారిశ్రామిక రంగంలోనూ పురోభివృద్ధి సాధించి పారిశ్రామిక వేత్తలుగా వృద్ది చెందాలని అభిప్రాయ పడ్డారు.

మాదిగ, మాదిగ ఉపకులాల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. మిక్కి సంస్థ ద్వారా మాదిగలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, అందుకు తన వంతు సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ప్రెసిడెంట్ సుంచు రాజ్ కుమార్, ఫౌండర్ ప్రధాన కార్యదర్శి బక్క నర్సింహ కోశాధికారి వి.సత్యేంద్ర కుమార్, ఉపాధ్యక్షులు అవునూరి సుధాకర్, కమిటీ సభ్యులు బి. ప్రశాంత్, ఎస్ భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మిక్కి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking