రోడ్డెక్కిన గులాబీ శ్రేణులు
కవిత అరెస్ట్ అక్రమం
నల్లబ్యాడ్జీలతో నిరసన
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడి అక్రమంగా అరెస్టు చేయటాన్ని నిరసనకు బిఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో శనివారం మిర్యాలగూడ పట్టణం సాగర్ రోడ్డు ఫ్లై ఓవర్ నుంచి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జిలు ధరించి, నల్లజండాలతో భారీ ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని వెంటనే విడుదల చేయాలని, ఇడి, మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితక్కని ఈడి అక్రమ అరెస్టు చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.

ఈడి, సిబిఐ అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ కుటుంబాన్ని భయపెట్టలేవని అదేవిధంగా ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ బిఆర్ఎస్, అరెస్టులు, వేధింపులను తట్టుకో నిలబడే పార్టీ బిఆర్ఎస్ అని, రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపలేవని ఎమ్మెల్సీ కవితక్కకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటామన్నారు.కార్యక్రమంలో డీసీఎంస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు మోహసిన్ అలీ, జిల్లా మాజీ రైతు బంధు అధ్యక్షులు చింతరెడ్డీ శ్రీనివాసరెడ్డి, ఎఎంసి మాజీ ఛైర్మన్ భైరం సంపత్, మాజీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ అంగోతు లలిత హతిరం నాయక్, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, పాలుట్ల బాబయ్య, టీఆర్ఎస్వి కార్యదర్శి ఎండి. షాయేబ్, మాజీ ఎంపీపీ పెలపొలు తిరుపతమ్మ, మహిళ విభాగం అధ్యక్షులు పెండ్యాల పద్మ , కార్యదర్శి కొదాటి రమా, పెరుమాళ్ రాఖీ, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.