సేంద్రియ వ్యవసాయంపై రైతులు, యువత దృష్టి సారించాలి

సేంద్రియ వ్యవసాయంపై రైతులు, యువత దృష్టి సారించాలి

గరిడేపల్లి అక్షిత న్యూస్ :

వ్యసాయ విస్తరణ యాజమాన్య సంస్థ సమేతి మరియు వ్యవసాయ శాఖ వారి ఆర్థిక సాయంతో కృషి విజ్ఞాన కేంద్రం, గడ్డిపల్లి నందు సేంద్రియ వ్యవసాయం పై ఏడు రోజుల సేంద్రియ వ్యవసాయం పై వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమంలో భాగంగ, 5వ రోజు కార్యక్రమంలో తెలంగాణ గో సేవ విభాగం మెంబర్ పి.మధన్ గుప్తా పాల్గొని సమగ్ర వ్యవసాయ విధానాలు మరియు రైతుల ఆదాయం రెట్టింపు చేసే పంటలను ఎంచుకోవాలని సూచించారు. రసాయన ఎరువులు వాడటం ద్వారా భూమి కలుషితం అవుతుందని, సేంద్రీయ వ్యవసాయం ద్వారా భూ ఆరోగ్యంతో పాటు, మానవ ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. సేంద్రియ వ్యవసాయంలో వాడే వివిధ రకాల ద్రావణాల, కషాయాన్ని తయారీ విధానాలను కూడా వివరించారు. సేంద్రీయ వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని రైతులు & యువత ఆసక్తి చూపించాలి అని తెలిపారు. ఆవు యొక్క పేడ, మూత్రం ద్వారా వివిధ రకాల ఉప ఉత్పత్తుల తయారి అయిన సబ్బులు, షాంపులు, అగర్ బత్తుల ద్వారా కూడా ఉపాధి పొందవచ్చని తెలిపారు. తరువాత మృత్తిక శాస్త్రవేత్త, ఏ.కిరణ్ సేంద్రియ ఉత్పత్తుల దృవీకరుణ పద్ధతులను వివరించారు. అలాగే సేంద్రియ ధ్రువీకరణ సర్టిఫికెట్లను ప్రతి ఏటా రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత & రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking