కళ్యాణం…కమనీయం
అంగరంగ వైభవం శ్రీశ్రీశ్రీపార్వతి రామలింగేశ్వరస్వామి కళ్యాణం
*భారీగా తరలివచ్చిన భక్తజనం
*ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న క్రీడాపోటీలు
*నేడు ఆమనగల్లుకు మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్, ఎమ్మెల్యే బిఎల్ఆర్ లు రాక
*చైర్మన్, తాళ్లవెంకటేశ్వర్లు- అశోకకుమారి
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
కాకతీయ రాజుల కాలం నాటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అతి పురాతన దేవాలయం, పడమర ముఖాద్వారం కల్గిఉన్న వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పార్వతి రామలింగేశ్వరఆలయంలో రెండవరోజు ఆదివారం సామాజిక వేత్త, ఆలయకమిటి చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు- అశోక కుమారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన వేదపండితులు,దేవాలయ అర్చకులు రెంటాల.మణి శర్మ ,సతీష్ శర్మ, గ్రామ పురోహితులు సూర్యనారాయణ శర్మల ఆధ్వర్యంలో వేదమంత్రాలు నడుమ శ్రీశ్రీశ్రీపార్వతి రామలింగేశ్వరుల కళ్యాణం భారీగా తరలివచ్చిన అశేషభక్త జనసందోహం నడుమ కళ్యాణం కమనీయం రమణీయంగా కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణంలో వందలాది మంది దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. మూడవరోజు తెల్లవారితే మంగళవారం కాకతీయ కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న అగ్నిగుండాల కార్యక్రమం వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులుఅగ్నిగుండాల నుంచి శివ,శివ నామస్మరణతో నడుచుకుంటూ బయకు వచ్చి తమ కోరికలు మొక్కులు తీర్చుకున్నారు.
*నేడు ఆమనగల్లుకు
నలుగురు మంత్రులు రాక*
వేములపల్లి మండలం ఆమన గల్లు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పార్వతి రామలింగేశ్వర ఆలయంలో నిర్వహించనున్న జాతర ముగింపు వేడుకలకు మంగళవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ, సీతక్కతో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -బిఎల్ఆర్ తదితరులు పాల్గొనటం జరుగుతుందని ఆలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్ల నాలుగవ రోజు గ్రామ ప్రజలు, బంధు మిత్రులతో కలిసి పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక బోనాలు సమర్పిస్తారు.
క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు నగదును బహుమతులను ప్రదానం చేయనున్నట్లు దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు- అశోక కుమారి తెలిపారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చే వేలాది భక్తులు సౌకర్యార్థంఅవసరమైనసౌకర్యాలు కల్పించడం జరిగిందని జాతర సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేములపల్లి ఎస్ఐ దాచేపల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దేవాలయం చుట్టూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం సుర్యాపేట నుండి ప్రతి 5 నిమిషాలకు వయా భీమవరం మీదగా మిర్యాలగూడ కు ఆర్టీసీ బస్సుసౌకర్యం లల్పించడం జరిగిందన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ సహాయ సహకారాలతో మున్ముందు దేవాలయంతో పాటు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అయన స్పష్టం చేశారు.