ఎమ్మెల్యే బిఎల్ఆర్ ను సన్మానించిన వైస్ ఎంపిపి
వేములపల్లి, అక్షిత ప్రతినిధి:
వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -బిఎల్ఆర్ ను స్థానిక ఎంపిటిసి, మండలప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు పాదూరి గోవర్థిని సిపిఐఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్ రెడ్డి లు మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే బిఎల్ ఆర్ ను వైస్ ఎంపిపి దంపతులు శాలువాకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఎంపిపి పుట్టల సునీత -కృపయ్య, నాయకులు రావు యాల్లారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.