దొరికిన చెక్కు బాధితునికి అందజేత
నిజాయతీ చాటుకున్న జర్నలిస్ట్ సురేష్
*అభినందించిన టూ టౌన్ సిఐ నాగార్జున
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
దొరికిన చెక్కును బాధితునికి అందించి జర్నలిస్టులు నిజాయతీ చాటుకున్నారు. సోమవారం సాయంత్రo నార్కెట్ పల్లి అద్దంకి బైపాస్ రోడ్డులోని ఉషారాణి హోటల్ సమీపంలో రూ.1.50 లక్షల విలువ చేసే చెక్కు నవతెలంగాణ రూరల్ రిపోర్టర్ బొమ్మగాని సురేష్ కు దొరికింది…ఆ చెక్కు సెల్ఫ్ గా ఉండటం…కనీసం అకౌంట్ పే లేకుండా కేవలం పేరు మీద చెక్కు ఉన్నది…అట్టి చెక్కు వెనుకాల వేములపల్లి మండలంలోని శెట్టిపాలెంలోని లక్ష్మిగణపతి రైస్ ఇండ్రస్ట్రీ అని స్టాంప్ ఉన్నది..ఈ విషయం నవ తెలంగాణ డివిజన్ రిపోర్టర్ ఆయూబ్ కు సమాచారం ఇవ్వగా. సంబంధిత రైస్ ఇండ్రస్ట్రీ యజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు.వారి ద్వారా బాధితుని వివరాలు సేకరించారు. అట్టి చెక్కు దారుడు త్రిపురారం మండలంలోని కంపాలపల్లి కి చెందిన పనస నాగరాజు గత నెల 26న లక్ష్మీగణపతి రైస్ మిల్లులో 74 క్వింటాళ్ల ధాన్యం అమ్మగా ఈనెల ఒకటో తేదీన సోమవారం ఆయన పేరు మీదన రైస్ మిల్ యాజమాన్యం చెక్కు జారీ చేశారు. చెక్కు తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో జారి పడిపోవడంతో రిపోర్టర్ బొమ్మగాని సురేష్ కు దొరికింది. బాధితుని వివరాలను సేకరించి, సమాచారం ఇచ్చి మంగళవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐ పి.నాగార్జున ఆధ్వర్యంలో బాధితునికి చెక్క అందజేశారు. దొరికిన చెక్కును నిజాయితీగా బాధితులకు అందజేసిన రిపోర్టర్లను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐ రాంబాబు, ఏఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.