చిన్న పత్రికలకు చేయూత

*చిన్న, పత్రికలకు, మ్యాగజైన్స్ కు అండగా ఉంటాం 

-తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కెఎస్ ఆర్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

చిన్న మధ్య తరహా దినపత్రికలు అండ్ మ్యాగజైన్స్ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఐజేయు జాతీయ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈరోజు సాయంత్రం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లోని సురవరం ప్రతాప రెడ్డి ఆడిటోరియంలో జరిగిన చిన్న, మధ్యతరహా దినపత్రికలు, అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్  సర్వసభ్య సమావేశానికి ఆత్మీయ ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. చిన్న పత్రికలు సమాజానికి అవసరమని మారుమూల ప్రాంతాల ప్రజల సమస్యలను చిన్న పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. చిన్న పత్రికలకు ఆనాటి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఉండే అన్ని హక్కులు చిన్న పత్రికలు, మ్యాగజైన్స్ కు కల్పించామని చెప్పారు. చిన్న పత్రికలకు అక్రిడేషన్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించింది ఏపీయూడబ్ల్యూజే అని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల విలేకరులకు అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించడంతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుండి వెలువడుతున్న చిన్న పత్రికలకు అక్రిడేషన్లు పొందే అవకాశం కలిగిందన్నారు. మాస పత్రికలకు మొట్టమొదటిసారి అక్రిడేషన్ల సౌకర్యం కల్పించింది ఏపీయూడబ్ల్యూజేనే అని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. చిన్న పత్రికలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రస్తుతమున్న రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి సానుకూలంగా ఉందని, జర్నలిస్టులతో పాటు చిన్న పత్రికలకు ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తామని, హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రులలో పని చేసేలా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ పత్రికలు పెద్ద పత్రికలు అనే తేడా లేదని చిన్న పత్రికల ఎడిటర్లు రిపోర్టర్లు పెద్ద పత్రికల రిపోర్టర్లు ఎడిటర్లతో సమానంగా శ్రమిస్తారని, వార్తలు రాయడంలో ఎవరైనా సమానమే అన్నారు. ఒక చిన్న పత్రికకు (ప్రజాతంత్ర) ఎడిటర్ గా ఉన్నప్పుడే ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షున్ని అయ్యానని చెప్పారు. చిన్న పత్రికలు మ్యాగజైన్స్ అసోసియేషన్ కు ఐజేయూ అండగా ఉంటుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్యతరహా దినపత్రికలు అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ గత పది సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేసి చిన్న పత్రికల హక్కులను పరిరక్షించడానికి, సమస్యల పరిష్కారానికి పోరాటం చేసిందని టీయూడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి ప్రశంసించారు. చిన్న పత్రికల సమస్యల పరిష్కారానికి అనేకసార్లు అధ్యక్షుడు యూసుఫ్ బాబు పోరాటాలు చేశారని, అనుక్షణం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సంఘం ప్రతి మూడు నెలలకోసారి కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకోవాలని, సంవత్సరానికి ఒకసారి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పత్రికల ముద్రణ లో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ వార్తలు, అలాగే ప్రజలకు సంబంధించిన సమాజంలోని వార్తలను చిన్న పత్రికలు మ్యాగజైన్స్ ప్రచురించడానికి కృషి చేయాలని చెప్పారు. దినపత్రికలు మ్యాగజైన్స్ యూనియన్ కు ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చిన్న పత్రికల అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు సమావేశానికి అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో అతిధులుగా పాల్గొన్న జాతీయ కార్యదర్శిగా నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎల్. గోపాల నాయుడు మాట్లాడుతూ చిన్న పత్రికలు మేగజైన్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని చెప్పారు. సమావేశానికి ముందు అసోసియేషన్ నాయకురాలు నస్రీన్ ఖాన్ అతిధులకు స్వాగతం పలుకగా, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దోనెటి బాలకృష్ణ గత మూడు సంవత్సరాల నుండి చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అశోక్ సమావేశానికి హాజరైన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ ను అసోసియేషన్ తరఫున ఘనంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ను ఈ సమావేశంలో సత్కరించారు. ఇటీవల టీయూడబ్ల్యూజే అధ్యక్షులుగా ఎన్నికైన విరాహత్ అలీ కి సన్మానం చేశారు. ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలనాయుడులను ఈ సందర్భంగా అసోసియేషన్ తరుపున సన్మానించారు.ఈ సమావేశంలో హెచ్యుజె అధ్యక్షులు శంకర్ శిగా, జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కిరణ్ కుమార్, ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. న్యూఢిల్లీ యూనియన్ బాధ్యురాలు స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking