బడుగుల ఆశాదీపం

అంబేద్కర్ తోనే తెలంగాణ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

దళిత ఆశాజ్యోతి , బడుగు బలహీనవర్గాల ఆశాదీపం, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్133వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో గురువారం అణగారిన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షులు, మునిసిపల్ కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ పట్టణంలోని పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ పంపిణి చేశారు. డప్పు వాయించి ఉత్సాహపరిచ్చారు. ఆయన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని వారన్నారు. ఆయన చూపిన దారిలో నడిస్తేనే నిజమైన నివాళులు అన్నారు.

కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొండేటి వెంకట్, సంఘం కాంగ్రెస్ నాయకులు డి.స్కైల్యాబ్ నాయక్, పొదిల శ్రీనివాస్, గాయం ఉపేందర్ రెడ్డి, మాజి జడ్పీటిసి దోసపాటి శ్రీనివాస్, మెడ సురేందర్ రెడ్డి, మెరుగు శ్రీనివాస్, ఎంఎ.సలీం, ఎంఎ.ఆరిఫ్, ఇరుగు మధు, ఆర్కే రామకృష్ణ, గుడుపూరి శ్రీనివాస్, ఉబ్బపల్లి కాశయ్య, దైద శ్రీనివాస్, కెవిపిఎస్ నేతఆర్.పరశురాములు, కె. మల్లయ్య, ఉద్యోగ సంఘం నేతలు మాడుగుల శ్రీనివాస్, కె. బాబురావు, ఎంపిటిసి బెజ్జం సాయి, గడగొజు అశోక్, మహేష్ గౌడ్, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking