కాంగ్రెస్ నవ్వుల పాలు
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పాలన నవ్వుల పాలయిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణం నందిపహాడ్ టీఎన్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో మిర్యాలగూడ నియోజకవర్గ బిఆర్ఎస్ కమిటీ, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగు, సాగు, విద్యుత్ ఇవ్వలేని చేతకాని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంగా ఆయన వర్ణించారు.

రుణ మాఫీ, రైతు భరోసా, భీమా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం అని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లలో బిఆర్ ఎస్ గెలుపుp ఖాయమని ఆయన అన్నారు. ప్రజలు తిరిగి బిఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డిని అత్యధిక మెజారటీతో గెలిపించుకోవాలని కోరారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, డీసీఎంస్ చైర్మన్ దుర్గంపూడీ నారాయణరెడ్డి, జడ్పీ కో.ఆప్షన్ సభ్యులు మోషిన్ అలీ, ఎంపీపీలు నూకల సరళ హనుమంతరెడ్డి,ధనవత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ లు అంగొత్ లలితహతిరాం నాయక్, కుర్ర సేవ్యానాయక్, నాయకులు అన్నబీమోజు నాగార్జునచారి, నల్లమోతు సిద్ధార్థ, జొన్నలగడ్డ రంగారెడ్డి, ధనవాత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, వీరకోటీరెడ్డి, మట్టపల్లి సైదయ్యయాదవ్, నామిరెడ్డీ కరుణాకర్రెడ్డి, పాలుట్ల బాబయ్య, పెద్ది శ్రీనివాస్ గౌడ్, మహిళా అధ్యక్ష, కార్యదర్శులు పెండ్యాల పద్మ, కార్యదర్శి రమా, మున్సిపల్ కౌన్సిలర్లు , వార్డు ఇంచార్జీలు, పాశం నరసింహరెడ్డి, దారగాని వేంకటేశ్వర్లు, కుర్ర శ్రీను, మజీద్, సోము సైదిరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.