వివిసి ట్రస్ట్ సేవలు అభినందనీయం

వివిసి ట్రస్ట్ సేవలు అభినందనీయం

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

-ఖమ్మం నగరానికి రెండు వైకుంఠ రధాలు నాలుగు వాటర్ ట్యాంకర్లు అందజేత

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

వివిసి ట్రస్ట్ సేవలు అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.నిన్న ఖమ్మం వివిసి గార్డెన్ లో వెంకటరమణ ఆటోమొబైల్స్ ఫౌండర్ వంకాయలపాటి వీరయ్య చౌదరి 25 వ వర్ధంతి ఘనంగా జరిగినది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ వీరయ్య చౌదరి మొదటి నుంచి కాంగ్రెస్ వాది అపరమేధావి అని కొనియాడారు.ఆయనతో నాకు మంచి అనుబంధం ఉన్నదని అయన సలహాలు సూచనలు కొరకు ఆయనను సంప్రదించే వాడినని అన్నారు.అయన స్థాపించిన ఈ వివిసి సంస్థలు తెలంగాణ వ్యాప్తముగా విస్తరించి ఉన్నాయని ముఖ్యంగా అయన పుట్టిన గడ్డ ఈ ఖమ్మం గడ్డ నాకు కూడా ఈ ఖమ్మం గడ్డ నా అడ్డా అని అన్నారు.వీరయ్య చౌదరీ స్థాపించిన ఈ వివిసి సంస్థ ను ఈ వివిసి రాజా మరింత విస్తరించి వాళ్ళ నాన్న పేరుతో వివిసి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని అన్నారు.నా చేతుల మీదుగా ఈ వివిసి ట్రస్ట్ ఉచిత మంచినీరు ను ట్యాంకర్లు ద్వారా పంపిణి కి శ్రీకారం చుట్టడం ఆనందముగా ఉన్నదని అన్నారు.

అందునా ఈ వేసవి లో తాగు నీటి కి చాలా ఇబ్బందిగా ఉన్నదని వర్షాలు రాక గ్రౌండ్ లెవల్ నీరు తగ్గటం వల్ల ఈ మధ్యనే పాలేరు కు సాగర్ జలాలతో నింపటం జరిగినది అన్నారు. నీటి పొదుపుగా వాడితే నీరు ను మనం సృష్టించినట్లే అని అన్నారు. ఈ మధ్యనే బెంగూళూరు డిప్యూటీ సీఎం ఇంటికే నీటి సరఫరా లేక ఇబ్బంది ఐనది అని అన్నారు. ప్లాస్టిక్ వాడకం సెల్ఫ్ కంట్రోల్ తో మనమే నిషేధించాలి అని అన్నారు.మంచి ఉద్దేశం తో వివిసి రాజా ఈ వివిసి ట్రస్ట్ ద్వారా అయన చేసే సేవలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతూన్నాయని అలాగే ఇక ముందు ముందు ఈ వివిసి ట్రస్ట్ సేవలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరింత చేరువ కావాలని వారికీ నా వంతుగా ఎలాంటి సహాయాన్నైనా చేస్తానని అన్నారు.మరోక ముఖ్య అతిధి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వివిసి సంస్థ వ్యవస్థాపకులు వంకాయలపాటి వీరయ్య చౌదరి పుట్టింది నా నియోజకవర్గం నాగులవంచ గ్రామం అని ఆ గ్రామానికి వివిసి ట్రస్ట్ ద్వారా అన్ని ముఖ్యమైన సదుపాయాలు నా చేతుల మీదుగా వారి వివిసి ట్రస్ట్ ద్వారా అందించడం జరిగినది అన్నారు.

నాగులవంచ పంచాయతీకి వైకుంఠ రధం ఫ్రీజర్ నాగులవంచ ముఖ్య కూడళ్లలో సిసి కెమెరాలు ఇలా చాల ఇవ్వడం జరిగిందని అన్నారు.ఈ సందర్భంగా వివిసి ట్రస్ట్ చైర్మన్ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ (వివిసి రాజా ) మాట్లాడుతూ మా నాన్న స్థాపించిన ఈ వివిసి గ్రూప్ తెలంగాణ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్నాదని అయన ఆశయాలకు అనుగుణంగా సంస్థను ముందుకు తీసుకువెళుతున్నామని అందుకు సహకరించిన ఉద్యోగులకు మా వివిసి కస్టమర్ లకు ఎంతో రుణపడి ఉంటామని అన్నారు.ప్రజల సేవ కొరకు వివిసి ఫ్యామిలీ ఎప్పుడు ముందు ఉంటుందని నాగులవంచ గ్రామములో గ్రామ పంచాయతీకి ఉచితంగా వైకుంఠరధం ఫ్రీజర్ బాక్స్ గ్రామంలో ముఖ్య కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. నాగులవంచ హైస్కూల్ లో వంకాయలపాటి రామయ్య భోజనశాల నిర్మించి ఇవ్వటం జరిగినది అని అన్నారు.మినరవ్ వాటర్ ప్లాంట్ ను నామ మాత్ర మైంటెనెన్చ్ ఛార్జ్ తో నాగులవంచ గ్రామానికి ఇచ్చామని అన్నారు.ఈ వేసవిలో మంచినీటి ఎద్దడి ఎక్కువ ఉన్నదని గమనించి మా వివిసి ట్రస్ట్ ద్వారా ఖమ్మం లో సుమారు 15 లక్షల వ్యయంతో ఐదు ట్యాంకర్లు ద్వారా ఉచిత మంచినీరుని మా వివిసి ట్రస్ట్ ట్యాంకర్లు ద్వారా పంపిణి మొదలు పెట్టామని దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబరు ఇస్తామని మంత్రి చెప్పినట్లు డిపార్ట్మెంట్ మరియు ప్రభుత్వ సహకారముతో ఎక్కడ అవసరం ఉంటె అక్కడ సరఫరా చేస్తామని అన్నారు. అలాగే ఈ ఉచిత నీరు పధకం ను ముందు ముందు జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తామని జిల్లా ప్రజలకు అందుబాటులో మా వివిసి ట్రస్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది అని అన్నారు.ఖమ్మం మెడికల్ కాలేజీ కి ఒక అంబులెన్సు కలెక్టర్ చేతులమీదుగా ఇవ్వడం జరిగిందని అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆ అంబులెన్సుకు సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయలతో వెంటిలేటర్ ను డిప్యూటీ సీఎం భట్టి చేతులమీదుగా మెడికల్ కాలేజీ కి ఇస్తున్నాం అని అన్నారు.ప్రతి మండలానికి ఒక వైకుంఠ రధం ఇవ్వడానికి మా వివిసి ట్రస్ట్ సిద్ధంగా ఉన్నదని ఇప్పటికే కొన్నిచోట్ల ఇచ్చామని మరియు ఇప్పుడు మంత్రి తుమ్మల డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా సుమారు 20 లక్షల వ్యయంతో ఖమ్మం మున్సిపాలిటీ కి ఒక వైకుంఠ రధం కొత్తగూడెం మున్సిపాలిటీకి ఒక వైకుంఠ రధం మా వివిసి ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర ముఖ్య కాంగ్రెస్ నాయుకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking