మిర్యాలగూడలో బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి వాకర్స్ తో ప్రచారం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
నల్లగొండ లోక్ సభ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మిర్యాలగూడ పట్టణంలో శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ లలో ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీతోనే దేశాభివృద్ధితో సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అనంతరం ప్రైవేట్ స్టేడియంలో క్రీడాకారులలో ప్రచారం నిర్వహించారు. షటిల్ బాడ్మింటన్ క్రీడా కారులతో ఆడారు.

ప్రచారంలో పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మలపల్లి హనుమంతరెడ్డి, చిలుకూరి శ్యామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, పురుషోత్తంరెడ్డి, మదన్మోహన్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి చిల్లంచర్ల అభి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పెదమామ్ భరత్, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కొండేటి సరిత, శేఖర్, ఎడ్ల రమేష్, సీతారామ్ రెడ్డి, లచ్చిరెడ్డి, పోరెడ్డి శ్రీను, అజయ్, ఉబ్బపల్లి నంద, బొట్టు సోములు, బంటు యాదగిరి, నాగిరెడ్డి, అశోక్ రెడ్డి, కరుణాకర్లు పాల్గొన్నారు