అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు గా రెమడాల సతీష్ ఎన్నిక

అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు గా రెమడాల సతీష్ ఎన్నిక

వేములపల్లి, అక్షిత న్యూస్ :

మండలంలోని మొల్కపట్నం గ్రామంలో అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశంనిర్వహించారు. ఈ సమావేశంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షునిగా రెమడాల సతీష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడు పుట్టల మాదేశ్,ప్రధాన కార్యదర్శి వల్లమల్ల పరమేష్, కార్యదర్శి ఈటా నాగరాజు, కోశాధికారి జేరిపోతుల తిరుమలేష్ లు నియమితులయ్యారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా యూత్ కమిటీ అధ్యక్షులు రెమడాల సతీష్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తానన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. యూత్ కమిటీకి అన్నివేళలా అందుబాటులో ఉంటానన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు రెమడాల పరుశరాములు, రెమడాల బిక్షం, జేరిపోతుల యాదగిరి , జేరిపోతుల చంటి, రెమడాల కరుణాకర్, జేరిపోతుల సురేందర్, రెమడాల ప్రవీణ్, వల్లమల్ల ఎల్లయ్య, వల్లమల్ల బాలస్వామి, జేరిపోతుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking