భువనగిరి ఏరియా ఆస్పత్రిలో దారుణం..*

*భువనగిరి ఏరియా ఆస్పత్రిలో దారుణం..*

*- సెల్ ఫోన్ లైట్ల వెలుగులో వైద్య సేవలు*

*- కరెంటు పోయిన వెంటనే ఆన్ కానీ జనరేటర్*

*- గంటపాటు ఆస్పత్రిలో నిలిచిపోయిన విద్యుత్..*

యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో:

భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. భువనగిరి ఏరియా ఆసుపత్రి నిర్వహకుల నిర్లక్ష్యంతో పేషెంట్లకు సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో వైద్య సేవలు అందించాల్సిన దుస్థితి నెలకొంది. బుధవారం రాత్రి సమయంలో ఏరియా ఆసుపత్రి వైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రిలో సైతం కరెంట్ నిలిచిపోయింది. అయితే ఆసుపత్రిలో వెంటనే ఆన్ కావాల్సిన జనరేటర్ ఆన్ కాకపోవడంతో సిబ్బంది పేషెంట్లకు సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసుకొని పేషెంట్లకు వైద్య సేవలు అందించాల్సిన దుస్థితి నెలకొంది.

అయితే వెంటనే ఆన్ కావలసిన జనరేటర్లో సాంకేతిక సమస్య ఉండడం వలన ఆన్ అవలేదని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. కరెంటు పోయిన 7 నుంచి 8 నిమిషాల తర్వాత జనరేటర్ ఆన్ అయిందని చెప్తున్నారు. కానీ సుమారు గంటపాటు కరెంట్ రాలేదని పేషెంట్లు చెబుతున్నారు.

ప్రధానంగా జనరేటర్ పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని ఆసుపత్రిలో సంబంధిత శాఖ నిర్వహకులు చూసుకోవాల్సి ఉంటుంది. కానీ జనరేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో దానిని పర్యవేక్షించక పోవడంతో ఇలాంటి దుస్థితి నెలకొందని పేషెంట్లు, భువనగిరి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి దుస్థితి రాకుండా సంబంధిత శాఖ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking