అవకాశవాద రాజకీయాలవైపు అందరి చూపు
-ప్రతి పక్షంలో ఉండటమే శాపంగా భావిస్తున్న నేతలు
-ఏపార్టీలో చూసినా ఆ నాయకులే……బిత్తరపోతున్న ప్రజలు
-సామాజిక వేత్త లోడిగ వెంకన్న యాదవ్ (పాలేరు)
ఖమ్మం/అక్షిత బ్యూరో :
రాతియుగం నుండి రాకెట్ యుగంలోకి కాలం పయనిస్తుంటే ప్రజాస్వామ్య రాజకీయాలు అధః పాతాళానికి తొక్క పడుతున్నాయి.నీతి నియయమాలు లేకుండా అధికారమే పరమావధిగా నాయకులు రాజకీయ వెంపర్లాటకు తెగబడుతున్నారు.అదిలేకుంటే నేను బ్రతకలేను అని విలవిల లాడిపోతున్నారు రాజకీయ నేతలు.భావితరాలు వీరిని చూసి సిగ్గు తో తలదించుకొనేలా ప్రజాస్వామ్య రాజకీయాలు బీటలు బారుతున్నాయి.రాజకీయాలో గెలుపు ఓటములు సహజం అని భావించకుండ అధికారం లేకుంటే నేను బతకలేను అని నేతలు భావిస్తున్నారు. కాని ఈ నేతల రాజకీయాలు తోలు బొమ్మల ఆటలుగా రాజకీయ వీది నాటకాలుగా నాయకులు చేస్తుంటే ఓటుకు నోటు తీసుకొని ప్రజలు చిత్రంలా చూస్తున్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు నేతలు పార్టీలు మారుతున్నాము అని చెపుతున్నప్పటికి నేతలు మారినంతగా ప్రజలు పార్టీలు మారటంలేదు.
ఏ పార్టీలో చూసినా ఆనాయకులే కనబడుతున్నారు.గెలిచినపార్టీయే నా పార్టీ అన్నట్టుగా ఉంది నేతల తీరు. ఎవరిది ఏపార్టీనో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు అర్ధం కావడం లేదు.అసలు నాయకులు కార్యకర్తలు పార్టీ లు ఎందుకు మారుతున్నారు వారు ఏపార్టీలో ఉన్నారు.ఉంటే ప్రజలకు మనపై ఉన్న భాద్యత ఏమిటి మన రాజకీయ ప్రజాస్వామ్య పాత్ర ఏమేరకు అవరం ఉంది ప్రజలద్వార రాజకీయ పార్టీ లో మనకు పని ఏమిటి అన్నది లేకుండ ఎంచుకున్న పార్టీలో ఉండకుండా రాజకీయ విలువలు గాలికి వదిలేదిసి పార్టీ లు మారుతున్న వైనం రాజకీయ రోత పుట్టింస్తుంది. ప్రజలు ఏమను కొంటారో అన్నది విస్మరించి నేతలు రాజకీయ విలువలు తుంగలోతొక్కి పార్టీల వెంట తిరుగుతున్నారు.
పార్టీమారడం అవసరమా ? మారి నేను ఏమిఉద్ధరిస్తా ?ముందు నా కుటుంబ బాద్య ఏమేరకు ఉంది ? నా కుటుంబానికి నేను ఏమేరకు బాద్యత నిర్వర్తింగలిగాను? ఒక్కసారి ఆలోచించి ఆతర్వాత నాకు ఉన్న సమయం ఎంత ? నేను ఏమేరకు ప్రజలకురాజకీయ సేవచేయగలను ఏ పార్టీ ని ఎంచుకొంటే నేను ప్రజలకు సందాన కర్తగా ఉండగలను అని ఒకసారి ఆలోచించుకొంటే తాను ఉండాలిసిన రాజకీయ పార్టీ ఆనేతకు కార్యకర్తకు అర్దం అవుతుంది. అదేది లేకుండా నిమిషం ఆలోచించకుండా పార్టీ లు మారడం నేతలకు ఫ్యాషన్ గా మారిపోయింది.
ఓడినా గెలిచినా ప్రజాస్వామ్యం లో ప్రజల గొంతుకై ప్రజల కొరకు ప్రజలతరుపున ప్రజా ప్రయోజనాల కొరకు పనిచేయాల్సిన నేతలు స్వప్రయోజనాల కొరకు పార్టీలు మారుతున్నారు అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. వారి సొంత స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారు. వారు ఏమి ఆశించకుండా పదవిలోకి రావాలని అనుకొంటున్నారా అనే ప్రశ్న ప్రజల్లో అనుమానాలు కలిగేలా రాజకీయ నేతలు ప్రజలకు అవకాశం కల్పించారు.అందుకే మాకేమి ఇస్తావ్ అనే ప్రశ్నలతో ఓటును నోటుకు బలిచేస్తున్నారు ప్రజలు.ఇది హేయమైన చర్యగా ఖడించాల్సిన రాజకీయ నాయకులే ముందు గా ఓట్లకు నోట్లతో బేరంపెట్టి నేను ఎక్కడ ఓడిపోతానో అన్నభయంతో ఓటు కు రేటునుపెంచి ఓట్ల సంతగా మార్చేశారు రాజకీయ నేతలు. డబ్బు తో పదవి కొనాలని నాయకులు భావిస్తే ఓటు ను తెగనమ్మడానికి సిద్ధపడ్డారు ప్రజలు.మద్యలో సంధాన కర్తలుగా మిగిలిపోయారు. కార్యకర్తలు ఇది భౌషత్ ప్రజాస్వామ్య రాజకీయాలకు గొడ్డలి పెట్టుగా మారనున్నాయి అనడంలో ఏలాంటి సందేహాలు అక్కరలేదు.డబ్బుంటే పదవి సంపాదించవచ్చు అలాంటప్పుడు ఏపార్టీ అయితే నేమి సీటిచ్ఛిన రాజకీయ పార్టీలోకి పార్టీ మారదాము అని నేతలు భావిస్తున్నారు. వారికి విధేయులైన ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు మండల నియోజకవర్గ స్థాయి పదవులు జిల్లా స్థాయి పదవులు నాయకులు పంచే ఎన్నికల ఖర్చు లో చేతివాటం కొరకు కొందరు పార్టీలు మారి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈరాజకీయ తంతులో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని రాజకీయ విలువలను కాపాడాల్సింది ఎవరు? ప్రజా అవసరాలకు ప్రజల ప్రాధమిక చర్యలకు ప్రజా గొంతుకై వినిపించే ప్రజా ప్రతినిధులు ఎవరు? ఓటును నోటుతో పదవిని సంతలో బేరమాడి కొన్న నేతకుప్రజా అవసరం పట్టిఉంటుందా ? తాను పట్టించుకొనేఅవరం ఏమేరకు ఉంది? తనడబ్బునుతాను రాబట్టుకోడానికి అధికార పార్టీకి మారితే తప్పేమిటి? నేతల వెంట తిరిగి తన సమయాన్ని మీ ఓటుకు నోటు కొరకు పనిచేసిన వాడు రేపు మీ వెంట ఉండాల్సిన అవసరం ఏమిటి ?ఈ రాజకీయ కుప్పిగంతులకు కారణం ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ప్రజలే…..చైతన్య వంతులైన ప్రజలు మేధావులు విద్యావంతులు ప్రజా సంఘాలు కవులు కళాకారులు నిజమైన కమ్యూనిస్టులు మేలుకొని రాజకీయ ప్రక్షాళన కు ప్రజాస్వామ్య పరిరక్షణ కు నడుము బిగించాలిసిన అవసరం ఆసన్నమైంది. ఓటుకు నోటు తో కాకుండా ప్రజాగొంతుకైన విద్యావంతులను ప్రజా ప్రతినిధులని ఎన్నుకొని రాజకీయ అవసరాలకొరకు పార్టీ మారే రాజకీయ నేతలను నిలదీసిన నాడు రాజకీయ ప్రజాస్వామ్యం విలువలతో బ్రతికి బట్టకడుతుంది. ఎన్నుకొన్న ప్రజల తీర్పును కాలరాసి ప్రజల అభీష్టంనకు వెతిరేకంగా పార్టీమారాలి అంటే రాజకీయ నేతల్లో వణుకు పుట్టాలి.ఒక నూతన రాజకీయ మార్పుకు ప్రజావిప్లవం రావల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రజల్లో ఈ రాజకీయ మార్పు కు నాంది పలకాలని ఆశిద్దాం.