అక్షర యోధుడు రామోజీ మరణం బాధాకరం
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగు దిన పత్రికల విస్తరణకు, నూతనత్వానికి ఆద్యులు రామోజీ రావు మరణం పట్ల తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. పత్రికా రంగంలో తెలుగు జర్నలిజానికి అఖిలభారత స్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి రామోజీ రావు అని, ప్రస్తుతం అమెరికాలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలుగు భాష సమున్నతికి, తెలుగు జర్నలిజం ద్వారా కృషి చేసిన కృషీ వలుడిని కోల్పోవడం బాధాకరమనని ఆయన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.