దుండిగల్ పురపాలకలో ప్రజావాణి ప్రారంభం..
ప్రతి సోమవారం కార్యాలయం ఆవరణంలో ప్రజావాణి
పురపాలక కమిషనర్ కే సత్యనారాయణ రావు
మేడ్చల్, అక్షిత బ్యూరో: దుండిగల్ పురపాలక కార్యాలయంలో సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు.కమిషనర్ కే సత్యనారాయణ రావు రెవెన్యూ అధికారులు కలిసి ప్రజల ప్రజావాణి కార్యక్రమాన్ని ఉదయం గం 10.00 లకు ప్రారంభించి మధ్యాహ్నం 1.00 గంటవరకు సంయుక్తంగా నిర్వహించారు. ప్రతి సోమవారం ఇదే కార్యాలయ ఆవరణలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు పురపాలక పరిధిలోని ప్రజలు సమస్యల పై ఈ ప్రజావాణి కార్యక్రమం లో దరఖాస్తులు సమర్పించి పరిష్కరించుకోనగలరని కమిషనర్ తెలిపారు. అంతేకాకుండా ప్రతిరోజు ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ నర్సింలు రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ గాయత్రి, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ అంజయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.