గిరిజన వసతి గృహం కేటాయించిన స్థలంలో దర్జాగా కబ్జాకు ప్రయత్నాలు..
కోర్టు ఆర్డర్లు పేరుతో రాత్రి రాత్రికే నిర్మాణాలు చేపడితే సహించేది లేదు..
ఎంతటి వారినైనా కబ్జాలకు తెగబడితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తాం..
గండి మైసమ్మ మండల తహసిల్దార్ సయ్యద్ అబ్దుల్ మతీన్..
మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధిలో ఈ మధ్యకాలంలో ప్రభుత్వ స్థలాలు ఖాళీగా కనిపిస్తే కబ్జారాయుళ్ల దర్జాగా కబ్జాలకు తెగబడుతున్నారు.ప్రభుత్వ స్థలాలలో కోర్టు ఆర్డర్లతో తెచ్చి రాత్రికీ రాత్రి నిర్మాణాలు కొనసాగిస్తూ దర్జాగా అమాయకులకు మాయమాటలు చెప్పి ప్రజలకు అంటగడుతూ. డబ్బులు.దండుకుంటున్నారు.
వివరాల్లోకెళ్తే దొమ్మర పోచంపల్లి సర్వేనెంబర్ 120/ 11 లో మూడు ఎకరాల పైగా ప్రభుత్వ స్థలం గండి మైసమ్మ చౌరస్తా నుండి మేడ్చల్ కు వెళ్లి ప్రధాన రహదారి లో దర్గా ఆనుకొని ఈ స్థలం మార్కెట్ వ్యాల్యూ కోట్ల రూపాయల పై మాటే ఉంటుంది ఈ స్థలం పై కబ్జాదారుల కన్ను పడింది ఒక ప్రక్కన స్క్రాప్ దందాలు మరో పక్కన మెటీరియల్ డంపింగ్ ఒక ప్రక్కన ఖబ్జా చేసి పెన్షన్ ఐరన్ జాలితో చుట్టారు ఇలా కబ్జాల పరం కొనసాగుతుంది.గిరిజన వసతి గృహం కేటాయించిన స్థలంలో దర్జాగా కబ్జాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తాసిల్దార్ ను మీడియా వివరణ’: కోరగా దీనిపై. వాస్తమే జరుగుతున్నట్లు సమాచారం అందింది కబ్జాలు చేస్తున్న ఊరుకునే ప్రసక్తే లేదు గిరిజన వసతి గృహానికి మూడు ఎకరాలు పైగా 2004 సంవత్సరంలోనే స్థలాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు.రెండు రోజుల క్రితం ఒక రూమ్ నిర్మాణం చేపట్టారు.
అది కూడా ఒక ఫేక్ ఆర్డర్ తో నిర్మాణం పూర్తి చేసుకున్నారు అయినా తన దృష్టికి రావడంతో పరిశీలన చేసి వెంటనే తన సిబ్బందితో కూల్చివేతలు చేపట్టామని అన్నారు. స్థలంలో త్వరలోనే గిరిజన వసతి గృహం వాళ్లతో సంప్రదించి చుట్టూ ఫెన్సింగ్ అందులో సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధిలో ప్రభుత్వ స్థలాలలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టిన ఎంతటి వారినైనా సహించేది లేదు కేసు నమోదు చేస్తాం తన సిబ్బంది ప్రణయం ఉన్నా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..