950 కోట్లు కొట్టేసి వాటి ప్లేసులో నల్లకాగితాలు పెట్టాలనుకున్న దొంగలు.. బెడిసికొట్టిన ప్లాన్
రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బోగిని జంగయ్య, మన్సూరాబాద్‌కు చెందిన శేఖర్‌రెడ్డి, ఎండీ మైమూద్ ముగ్గురూ కలిసి పథకం వేసి తుర్కయాంజల్ శ్రీరామ్‌నగర్‌లో నివాసముండే ఓ చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందని ఓ వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు.
ఆ నల్లధనాన్ని ఎలాగైనా కొట్టేయాలని అంతా కలిసి పథకం వేసి.. నల్ల ధనం ప్లేసులో నల్ల కాగితాలు పెట్టడానికి అవి తీసుకొని ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి 1 గంటకు చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లోకి ప్రవేశించి, ప్రధాన ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా శబ్దం రావడంతో యజమాని తిరుమనతురై అప్రమత్తమై సీసీ కెమెరాలను పరిశీలించాడు.
కొందరు ఇంట్లోకి వస్తున్నట్లు గుర్తించి 100కు కాల్ చేశాడు.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి సీసీ పుటేజీలు పరిశీలించి నిందితులను పట్టుకున్నారు.