కేసీఆర్ పై బురద జలొద్దు

కేసీఆర్ పై బురద జలొద్దు
యాదాద్రి ప్లాంట్ వద్దా?
నిమ్మల నవీన్ రెడ్డి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

చిమ్మ చీకట్లో నుంచి విరజిమ్మే వెలుగులద్దేలా విశిష్ట కృషి చేసిన మాజీ సీఎం కేసీఆర్ పై బురద జల్లె కుట్రకు తెర లేపారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి అన్నారు. మంగళ వారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంక్షోభం నుంచి నిరంతర విద్యుత్ సరఫరా చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కడం విడ్డూరంగా ఉందన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పైన బురదజల్లడం మానుకోవాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసే న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ఎస్ పార్టీ పైన అభండాలు వేయడo ఆపాలని, కేవలం జస్టిస్ నరసింహారెడ్డి అక్రమ సంపాదనను కాపాడుకోవడానికి అలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో అతని సహధర్మచారిని పేరు మీద అక్రమంగా ఆక్రమించిన 3500 గజాల స్థలాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దల ప్రాప్తం కోసం, అక్రమ సంపాదనని కాపాడుకోవడం కోసం పాకులాడుతున్నారన్నారు. నరసింహారెడ్డి జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ గా కొనసాగే అర్హత ఎంత మాత్రం లేదని, వారు వెంటనే కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను స్థానిక యువత చెప్పులతో కొట్టే సమయం ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. ఎంతోమంది స్థానిక యువతీ,యువకులకు ఉపాధి కల్పించే ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ సన్నాసులకు ఆ ప్రాజెక్టు విలువ తెల్వదన్నారు.
విద్యుత్ ప్లాంట్ పూర్తయితే తెలంగాణ కారు చీకట్లను పారద్రోలవచ్చన్నారు.తెలంగాణ ప్రయోజనాలు, అంతకన్నా మిన్నగా ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా ? కోదండరాంకు నల్గొండ కనిపించడం లేదా? నని ప్రశ్నించారు. ఎన్ని అపవాదులు మోపినప్పటికి నిజం నిలకడగా తేలుతుందన్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ దద్దమ్మ నేతలు నాటి లాగే ఇప్పుడు కూడా నోరెత్తకుండా వ్యవహరిస్తున్నారన్నారు. జస్టిస్ నరసింహ రెడ్డి తీరు మార్చుకోవాలని,స్వచ్ఛందంగా కమీషన్ ఛైర్మన్ భాద్యతల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking