ఎమ్మెల్యే పల్లా జన్మదిన వేడుకల్లో బ్లడ్ డొనేషన్ చేసిన నాయకులు
చేర్యాల,జులై 11 అక్షిత ప్రతినిధి: జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గురువారం శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని, అనంతరం చేర్యాల పట్టణ కేంద్రంలో రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డికి బిఆర్ ఎస్ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. జనగామ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అనునిత్యం ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ చేస్తున్న బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్, ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిలో మాజీ ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, రాష్ట్ర నాయకులు గద రాజు చందు, జితేందర్ రెడ్డి తదితర నాయకులు రక్తదానం చేసిన వారిలో ఉన్నారు.

అనంతరం ఎమ్మెల్యే బ్లడ్ డొనేషన్ చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఏ మల్లేశం, ఏఎంసీ చైర్మన్ ఎస్ మల్లేశం గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, వైస్ ఎంపీపీ టి నవీన్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు పి ఎల్లారెడ్డి, మరియు కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.