ఆకునూరు అంగన్వాడి కేంద్రంలో గ్రోత్ మేళ

ఆకునూరు అంగన్వాడి కేంద్రంలో గ్రోత్ మేళ

చేర్యాల,జులై 11 అక్షిత ప్రతినిధి: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని అంగన్వాడి టీచర్లు గురువారం గ్రోత్ మేళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి, సిపిఎస్ పాఠశాల హెచ్ఎం హాజరై O నుండి 5 సంవత్సరాల పిల్లలను గ్రోత్ ద్వారా బరువులు మరియు ఎత్తులు మానిటరింగ్ నిర్వహించినారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తారీఖున అప్పుడే పుట్టిన పాప నుండి నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు బరువు/ ఎత్తులను, 3 విధాలుగా మానిటరింగ్ చేసి వారి పోషణ స్థాయిని గుర్తించడం జరుగుతుందని తెలిపారు. బరువు తక్కువ ఉన్న పిల్లల తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పోషణ స్థాయిని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలయ్య, పాఠశాల హెచ్ఎం అయోధ్య, అంగన్వాడి టీచర్లు టి ఉమారాణి, ఎం మల్లమ్మ, కె శ్యామల, టి స్వప్న, ఏ విజయ, వి ప్రణీత, కె కళమ్మ మరియు సిఏలు, ఆశాలు,పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking