నగరంలోని భద్రకాళీ ఆలయ మార్గంలో డేంజర్ బెల్
వరంగల్, అక్షిత బ్యూరో:
వరంగల్ లోని భద్రకాళీ ఆలయ మార్గం లో శిధిలావస్తలో కల్వర్టు పట్టింపు లేని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు…భద్రకాళి రోడ్ లో ప్రమాదకరంగా మారిన వంతెన. భద్రకాళి అమ్మవారి శాకంబరీ ఉత్సవాల సందర్భంగా ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు. భద్రకాళి ఆలయానికి వస్తున్న వాహనదారులకు భక్తులకు ప్రమాదకరంగా మారిన వంతెన పరిస్థితి. భద్రకాళి అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కూడా చెల్లించని మున్సిపల్ అధికారులు ఈ క్షణాన కూలుతుందోనని బాటసారులకు భక్తులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా నగర పాలకులు వంతెన మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.