యాదగిరి గుట్టలో భారీ ఎత్తున గిరిప్రదక్షిణ…..
* గిరి ప్రదక్షిణను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య….
* అంగరంగ వైభవంగా జరిగిన గిరి ప్రదక్షిణ……
యాదగిరిగుట్ట, అక్షిత ప్రతినిధి :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం అయినా స్వాతి నక్షత్రం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున భక్తులు స్థానికులు పెద్ద ఎత్తున గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.గిరి ప్రదక్షణ ప్రారంభించి ఉత్తరం తూర్పు నుండి తిరిగి వైకుంఠ ద్వారం వద్ద ముగిసింది.ఈ సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి జై నారసింహ..లక్ష్మీనరసింహ నినాదాలతో మాడవీధులన్నీ మారుమోగాయి. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన గిరిప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు భజన మండలి సభ్యులు స్థానికులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. దీంతో యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక వాతావరణం వెలు విరిసింది. గిరి ప్రదక్షణ అనంతరం భక్తులు కొండపైన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదితర ప్రముఖులకు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య మాట్లాడుతూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున గిరిప్రదక్షిణ చేయడం ఎంతో పుణ్యాదాయకమని అన్నారు. ఈ గిరి ప్రదర్శన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ఇదే తరహాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు. అనంతరం జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.ఈ రోజు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యార్ ఐఏఎస్ , దేవాదాయ శాఖ కమీషనర్ హన్మంత రావు ఐఏఎస్, వై టి డి ఏ విసి కిషన్ రావు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి భాస్కర్ రావు కార్యనిర్వాహణ అధికారి దర్శనం ఏర్పాట్లు చేశారు. వేదాశీర్వచనం తదుపరి శ్రీ స్వామి వారి ప్రసాదము అందజేసియున్నారు.
అనంతరము ఈ రోజు నిర్వహింపబడిన వనమహోత్సవములో మొక్కలు నాటుట జరిగినది. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ సుధా దేవేందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కైరం కొండ వినోద్ కుమార్, కౌన్సిలర్ ముచ్చర్ల మల్లేష్ యాదవ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్, పన్నీరు భరత్, సాంబెష్ ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ప్రధాన అర్చకులు నరసింహ చార్యులు,తెలంగాణ టూరిజం యాదాద్రి మేనేజర్ జంగయ్య, సీనియర్ జర్నలిస్ట్ కైరం కొండ నవీన్ కుమార్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.