ఉట్టిపడిన ఆధ్యాత్మికత

ఉట్టిపడిన ఆధ్యాత్మికత

ఇస్కాన్ లో జగన్నాథ రథయాత్ర

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఆధ్యాత్మికత ఉట్టిపడింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్), హైటెక్ సిటీ సిటీలో ఆదివారం శ్రీ జగన్నాథ రథయాత్రను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ హోమియోపతి అధినేత, సినీ నిర్మాత డాక్టర్ రవికిరణ్ యాదవ్ విచ్చేసి రథయాత్రను ప్రారంభించారు. యాత్ర _మధ్యాహ్నం_ 5.30 గంటలకు సైబర్ వ్యాలీ నుండి ప్రారంభమై కొండాపూర్ చౌరస్తా మీదుగా హైటెక్ సిటీ వరకు రథయాత్ర సాగింది సాయంత్రం 8:30 గంటలకు ముగిసింది.

ఇస్కాన్ మియాపూర్ అధ్యక్షుడు శ్రీ రామ్ దాస్, ఇస్కాన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ యుధిష్టర్గోవింద్ దాసు, ఇస్కాన్ హైటెక్ సిటీ ఇంచార్జ్ శిరోద్ దాసు‌, ఇస్కాన్ సభ్యులు విష్ణువర్ధన్ యాదవ్, కాలనీవాసులు,పుర ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.


ఊరేగింపు అనంతరం ఆలయ మైదానంలో భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు, మహా-ఆరతి నిర్వహించారు మొత్తం మార్గంలో వేలకొలది మంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking