రాజా ఇన్ ఫ్రాకు
మరో ఇంటర్నేషనల్
ఐకాన్ అవార్డు
హాల్ ఆఫ్ ఫేమ్ 2024 అవార్డు సొంతం
తార్నాక, అక్షిత ప్రతినిధి :
రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ కు మరో ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు దక్కింది. హాల్ ఆఫ్ ఫేమ్ 2024 అవార్డును రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ కైవసం చేసుకుంది. ఇన్వెస్టర్లు, కస్టమర్ల ప్రయోజనాలే లక్ష్యంగా బెస్ట్ సర్వీస్ ఇవ్వడంలో రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ సఫలీకృతమైంది. అందును పురస్కరించుకొని ద రూపీ కంపెనీ ఆధ్వర్యంలో యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ ఇన్వెస్టర్లు, కస్టమర్లకు నీతి… నిజాయితీగా పారదర్శకమైన సేవలందిస్తున్నందులకు రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ కు అవార్డు దక్కడం సంతోషంగా ఉందని అన్నారు. కస్టమర్ సర్వీసే మా ముఖ్య ఉద్దేశమని ఎస్ఎస్ రాజు తెలిపారు.
ఈ అవార్డును సొంతం చేసుకున్న ఆయన ఇదంతా కూడా కస్టమర్ల సపోర్ట్ తోనే సాధ్యమైందన్నారు.
ఈ కార్యక్రమంలో దా రూపీ కంపెనీ చైర్మన్ గణేష్ అట్లూరి, డాక్టర్ అశ్విన్ అమరేశ్వర్, డాక్టర్ మార్కండేయులు, డాక్టర్ ఐశ్వర్య పాతపాటి, మిస్ సర్జరీ రెసిడెంట్, మిస్ గ్లోబ్ ఇండియా 2023 అంబాసిడర్ ఆఫ్ వరల్డ్ ఎక్స్పోర్ట్ 2030 భూసన్ సౌత్ కొరియా, ప్రవీణ్ కుమార్, డాక్టర్ అశోక్ కుమార్ లెంక పద్మభూషణ్ అవార్డు గ్రహీత, వెటర్న్ డాక్టర్ బికె మిశ్రా ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్, అక్షిత గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దాస్ యం.రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ హెచ్ఓడి రజిని, స్నేహ, నీరజ తదితరులు పాల్గొన్నారు.