ఉచిత వైద్య శిబిరం పేదల పాలిట వరం

ఉచిత వైద్య శిబిరం పేదల పాలిట వరం

కార్పొరేటర్ కవిత రాజు యాదవ్

వరంగల్, అక్షిత బ్యూరో:

12 వ డివిజన్ దేశాయపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఎన్ పి ఆర్ నగర్ లో కమ్యూనిటీ హాల్ వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.డాక్టర్ భరత్ కుమార్ కాలనీ ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు,ఈ ఉచిత వైద్య శిబిరం నికి కార్పొరేటర్ కావటి కవితరాజ్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ కాలనీ వాసులు ఈ ఉచిత వైద్య శిబిరం ని తగు పరీక్షలు చేసుకుని సద్వినియోగం చేసుకోగలరన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్ సూపర్వైజర్ జే కొర్నేలు, ల్యాబ్ టెక్నీషియన్ రజియా, ఏఎన్ఎం జ్యోతి, ఆశా వర్కర్ సుమలత, మాధవి, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking