వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
మరిపెడ అక్షిత ప్రతినిధి:-
మరిపెడ మున్సిపాలిటీ కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ మంగళవారం పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ సింధూర రవితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృక్షో రక్షితి రక్షితః అనే నినాదంతో ప్రతి ఒక్కరు మొక్కలను నాటే బాధ్యతను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ మరిపెడ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వార్డు కౌన్సిలర్లు, వార్డుఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post