*రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షల వెలువ
ఇబ్రహీంపట్నం అక్షిత ప్రతినిధి : తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని తొర్రూర్ గ్రామంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మాజీ జైల్ అడ్వైజర్, బోర్డు మెంబర్ లయన్ కెవి రమేష్ రాజ్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎన్ను గోవర్ధన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి అత్యధికంగా రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మల్రెడ్డి రాంరెడ్డి స్పందిస్తూ కచ్చితంగా ఇబ్రహీంపట్నంకి అధిక నిధులు కేటాయించేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పన్యాల జయపాల్ రెడ్డి, వొంగేటి నరేందర్ రెడ్డి, శివలింగం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.