తెలంగాణకు మొండిచేయి

తెలంగాణకు మొండిచేయి

ఏపీకి హామీలు

బిజెపికి 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణకు నిధులు సున్న

తెలంగాణ విభజన హామీలు పట్టని కేంద్రం

తొమ్మిది రంగాలపై కేంద్రం ఫోకస్

బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేదు

కొడంగల్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగ శ్రీనివాస్

కొడంగల్, అక్షిత ప్రతినిధి :

కొడంగల్ నియోజకవర్గం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగే శ్రీనివాస్మాట్లాడుతూ…
తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించాం కాని దక్కింది శూన్యం అన్నారు. రూ.48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్ద పీట వేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదు. కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు అసంతృప్తిని మిగిల్చిన కేంద్ర బడ్జెట్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగే శ్రీనివాస్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిరాశ మిగిలించిందని తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి ఎనిమిది మందినీ కేంద్ర ప్రభుత్వంపై నమ్మకంతో పార్లమెంటుకు పంపితే పక్క రాష్ట్రంపై చూపించిన ప్రేమ ఈ ప్రాంతం పైన లేకపోవడం బాధాకరమైన అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచి ఈ ప్రాంతం పై సవితి తల్లి ప్రేమ చూపించిందని ఇప్పటికైనా ఈ ప్రాంత ఎంపీలు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అత్యధిక నిధులు తీసుకురావాలని లేనిపక్షంలో ఈ ప్రాంత ప్రజల మండిపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking