హరీష్ రావు వ్యాఖ్యలు గర్హనీయం
– డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి తాటిపాముల శేఖర్ గౌడ్
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన ప్రస్తుత రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి టిఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి తాటిపాముల శేఖర్ గౌడ్ తెలిపారు. శనివారం రామన్నపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు.తెలంగాణ ఉద్యమ సమయంలో యువత భావోద్వేగాలను రెచ్చగొట్టి వారి ఆత్మహత్యలకు కారణమైన హరీష్ రావు కోమటిరెడ్డిని విమర్శించే అర్హత లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా పాలనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక హరీష్ రావు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సమాజానికి కోమటిరెడ్డి అభిమానులకు హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .హరీష్ రావును ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అడుగుపెట్టనీయమని హెచ్చరించారు.